మనసులో లేని ప్రేమ ఆప్యాయతలు పైకి ప్రదర్శించినంత మాత్రాన ఎదుటి వారికి అర్ధం కాకుండా పోదు కదా.సరిగ్గా ఇదే విధంగా ప్రదర్శిస్తూ ఉంటుంది మాధవీలత.స్వంత అక్క,బావ ఒక్కరోజు అంటే రెండు పూటలు ముఖ్యమైన పని ఉండి ఊరునుండి మాధవీలత ఇంటికి వచ్చారు.వాళ్ళు రావటం ఇష్టం లేనట్లుగా ప్రవర్తించి బయటనుండి టిఫిన్లు, కూరలు తెప్పించి వేళగానివేళకు పెట్టి వీళ్ళ పనులకు అడ్డుతగిలేది.బయటకువెళ్ళి భోజనం చేస్తే మిగతావాళ్ళు బాధ పడతారని ఎలాగో ఆఒక్కరొజు ఉండి వచ్చేశారు.చెల్లెలు ఉండగాహోటలులోఉండడంఏమిటి? అనుకుంటారని వాళ్ళింటికి వెళ్ళటం జరిగింది.తనకు మాత్రం అక్కఇల్లంటే ఎక్కడలేని స్వతంత్రం.పిల్లలకు శెలవులు ఇవ్వగానే ఎక్కడలేని ప్రేమ ఒలకబోసి మేము మీఇంటికి వస్తున్నామని ఫోన్లు మీద ఫోన్లు గంటగంటకుచేస్తుంటుంది. బావకు బదిలీ అవటంవల్ల మాధవీలత ఊరు వస్తున్నారని తెలిసి ఇక శెలవులకుఎక్కడకూ వెళ్ళలేము అనుకుందో ఏమో? అసలే స్వార్ధపరురాలు.ఆఒక్క రోజు మర్యాద దక్కించుకుంటే బాగుండేది కదా!మళ్ళీ అక్క,బావ స్వంత ఊరు వచ్చేసరికి వారానికి ఒకసారి భోజనానికి రమ్మని బలవంత పెడుతుంది.రావటానికి కుదరదు అని చెప్తే మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు?మీపనులు చూసుకుని భోజనం సమయానికి రావాల్సిందే అంటూ ఒకటే ఫోన్లు.ఈ చచ్చు తెలివితేటలు ఆరోజే ఉంటే అందరికీ బాగుండేది.అక్కమనసు బాధపడేది కాదు.అక్కకు చెల్లి ప్రవర్తనకు విరక్తి పుట్టి మనసులో బాధపడినట్లుగా కూడా బయటపడకుండా మర్యాదగా ఏమీ అనుకోవద్దు మాధవీలతా!మీకూ,మాకూ కూడా ఇబ్బంది వీలైనప్పుడు కొంచెంసేపు వచ్చి వెళ్తాము భోజనం చేయాల్సిందే అనుకోవద్దు అని చెప్పింది.బావకు నేను చెప్తాను ఫోను ఇవ్వు అంటుంది.బావ కూడా అదే చెప్పేసరికి ఏమి మాట్లాడాలో తెలియక సరే అనేసింది.పైకి
ప్రేమ ఒలకబోసినంత మాత్రాన చేసింది మర్చిపోయి భోజనానికి మొహం వాచిపోయినట్లు ఎవరూ వెళ్ళలేరు కదా!
ప్రేమ ఒలకబోసినంత మాత్రాన చేసింది మర్చిపోయి భోజనానికి మొహం వాచిపోయినట్లు ఎవరూ వెళ్ళలేరు కదా!
No comments:
Post a Comment