జ్వాల గుళ్ళో సమారాధనకు మేనత్త కబురుచేస్తే వెళ్ళింది.అక్కడ శివాలయంతో పాటు రామాలయనికి తీసుకెళ్ళారు.ఎప్పుడైనా రామాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా రాములవారిని దర్శనం చేసుకోకూడదని చెప్పారు.ముందుగాఎదురుగా ఉన్నఅంజనేయస్వామిని దర్శనం చేసుకుని తర్వాత అమ్మ సీతమ్మను,ఆతర్వాత తమ్ముడైన లక్ష్మణుడిని,చివరగా రాములవారిని దర్శనం చేసుకోవాలని చెప్పారు.ఎక్కడైనా రాములోరిని దర్శించే విధానం ఇదేనని,దర్శనం చేసుకోవాలంటే వీరందరి అనుమతి తీసుకోవాలని అప్పుడే ఫలితం ఉంటుందని చెప్పారు.జ్వాలకు ఇదంతా తెలియదు కనుక చెంపలు వేసుకుని ఇక ముందు రామాలయంకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఇదే విధంగా దర్శనం చేసుకోవాలని అనుకుంది.
No comments:
Post a Comment