వారిజ భర్త బదిలీ కారణంగా ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి వెళ్లవలసి వచ్చింది.అక్కడ పావురాలు తప్ప వేరే ఏ పక్షీ కనిపించేదికాదు.అక్కడ మూడు సంవత్సరాలు ఉంటే ఏడాదికి రెండుసార్లు చొప్పున మూడు సంవత్సరాలలో ఆరుసార్లు మాత్రమే చుట్టం చూపుగా ఒక కాకి కావుకావు మంటూనేను వచ్చానని అరుస్తూ ఆకాశంలో చక్కర్లు కొట్టి వెళ్ళేది.ఎక్కడా ఆగేది కాదు.ఇన్నాళ్ళకు కాకి కనిపించిది కదా అనుకునే లోపు మాయమై పోయేది.
No comments:
Post a Comment