సుశీల ఇంటికి వాళ్ళ ఆడపడుచు పిల్లలను తీసుకుని రెండు రోజులు ఉండి వెళదామని వచ్చింది.ఉద్యోగ రీత్యా బదిలీపై వాళ్ళు చాలా దూరప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది.తెలుగు భాష మాట్లాడినా కొన్ని మాటలు అర్ధం చేసుకోలేమని సుశీలకు చెప్పింది.ఆక్రమంలోనే ఒకామె చపాతీలోకి చొత్తు కూర చేశాననని చాలా బాగుంటుందని చెప్పింది.అది ఎలా చేస్తారో చెప్పమనగానే ఈ క్రింది విధంగా చెప్పటం మొదలెట్టింది.
ముల్లంగి -3,టొమాటో - 5,ఉల్లిపాయలు - రెండు,పచ్చిమిర్చి - 5,ఉప్పు - సరిపడా,కారం-2 లేక 3 స్పూన్లు,చింతపండు - కొంచెం,బెల్లం - కొంచెం,నూనె -కూరకు సరిపడా ,తాలింపు దినుసులు,కరివేపాకు,కొత్తిమీర
ముందుగా చిన్న కుక్కర్ లో నూనె వేసి, తాలింపు దినుసులు కరివేపాకు వేసి వేగాక
ఉల్లి,పచ్చిమిర్చి,ముల్లంగి ముక్కలు వెయ్యాలి.కొంచెం వేగాక టొమాటో ముక్కలు,ఉప్పు,కారం వేసి కొంచెం వేగిన తర్వాత చింతపండు చిక్కగా పులుసు పిండి,బెల్లం కూడా వేసి మూతపెట్టి మూడు కూతలు రానివ్వాలి.స్టవ్ కట్టేసి మూత వచ్చిన తర్వాత 2 ని.లు ఇగరనిచ్చి దించేయాలి అని చెప్పింది.అందరికీ నచ్చాలని లేదు.మాకూ చాలా ఇష్టం

అని చెప్పింది.ఒకసారి ప్రయత్నించి నచ్చితే వండుకోవచ్చు.మనం దీన్ని ముల్లంగి,టొమాటో కూర అంటాము.వాళ్ళు చొత్తు కూర అంటున్నారు అంతే తేడా.
No comments:
Post a Comment