విశాలమ్మ ఏడాది మనుమరాలి చేతికున్నగాజులు ఎవరో దొంగిలించారు.విశాలమ్మ తోడుకోడలికి చెయ్యి ఆడింపు అంటే దొంగతనం చేసే అలవాటుంది.ఎవరూ ఆమె తీసేటప్పుడు చూడలేదు కనుకఆమె మీద అనుమానమున్నా మాట్లాడలేని పరిస్థితి.ఒకరోజు విశాలమ్మ తోడుకోడలితో పాటు అందరూ కూర్చుని ఉండగా ప్రక్కింటి ఆమె అక్కా మనుమరాలి గాజులు పోయినయ్యంటగా?అనేసరికి విశాలమ్మ కడుపుమండిపోయి అవును ఎవరూ తీసారో పసిపిల్ల గాజులు ఆళ్ళ చేతులు విరిగిపోను ,ఆళ్ళ నోరు పడిపోను అంటూ తిట్ల దండకం మొదలెట్టింది. విశాలమ్మ తిట్లు మొదలెట్టగానే తోడుకోడలు చిటుక్కున అక్కడనుండి లేచి బయటకు వెళ్ళిపోయింది.ఎవరింట్లో ఏదైనా పోయినా ఆమె పనే అని అనుకున్నట్లుగానే ఆమే గాజులు తీసిందని అర్ధమైపోయింది.
No comments:
Post a Comment