రాణీ మాలినీ దేవి ఇతన్ని ఎక్కడో చూచినట్లుగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంది.ఇతనితో మనకు శత్రుత్వం ఏమీ లేదే అలా చూడాల్సిన అవసరం ఏముంది?అనుకుని అంతకుముందే
రాణీ విజయలక్ష్మీ దేవి గారు ప్లీడరు గురించి చెప్పి అతని తమ్ముడిని చూపించడం అకస్మాత్తుగా గుర్తొచ్చింది.ఓహో
రాణీ విజయలక్ష్మీ దేవి గారు ప్లీడరు గురించి చెప్పి అతని తమ్ముడిని చూపించడం అకస్మాత్తుగా గుర్తొచ్చింది.ఓహో
ఇతను ప్లీడరు అయ్యుంటాడు అనుకుంది.35 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కనిపించాడు.ఈసారి కోపంగా దవడ కండరం బిగించి మింగేసేలా రాణీ మాలినీ దేవి భర్త వైపు చూస్తున్నాడు.ఇదంతా తెలియని ఆయన ప్రక్కనేకూర్చున్న తెలిసినాయన మాట్లాడుతుంటే వింటూ భోజనం చేస్తున్నారు.రాణీ మాలినీ దేవి భోజనం చేయడం ఆపేసి మరీ అతన్ని కోపంగా చూస్తుండేసరికి అతని తమ్ముడు ఆవిడ చూస్తుంది అని చెప్పేసరికి తల వంచుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.చదువుకునే రోజుల్లో కూడా ఎవరైనా తన వైపు చూస్తుంటే రాణీ మాలినీ దేవి అలాగే కోపంగా మొహం చిట్లించి చూస్తే తల దించుకుని వెళ్ళిపోయేవారు.ఆ చూపుల్లో సూటిదనం నోటితో మాట్లాడకుండానే ఎదుటివాళ్ళ తప్పుని సరిదిద్దుకునేలా చేసేది.
(ముగింపు తదుపరి పోస్టులో)
(ముగింపు తదుపరి పోస్టులో)
No comments:
Post a Comment