ఆడవాళ్ళైనా,మగవాళ్ళైనా ఉద్యోగంలో కానీ,వ్యాపారంలో కానీ తీరిక లేకుండా ఉంటున్నారా?అయితే చిన్నచిన్న మార్పులు చేసుకుని కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించండి. తప్పనిసరిగా రాత్రిపూట అందరూ కలిసి భోజనం చేసేలా ప్రణాళిక సిద్దం చేసుకోండి.అలా వీలుపడకపోతే కనీసం వారంలో రెండు,మూడు రోజులైనా ప్రయత్నించండి.అదీ కుదరకపోతే వారంలో ఒకరోజు మిగతా పనులన్నీ ప్రక్కన పెట్టి పూర్తిగా కుటుంబంతో సరదాగా,సంతోషంగా గడపాలని నిర్ణయించుకుని తప్పని సరిగా పాటించండి.మీకు,కుటుంబానికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది.మనసు ప్రశాంతంగా ఉంటుంది. రెట్టింపు ఉత్సాహంతో వారం అంతా పనిచేసుకోగలుగుతారు.సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా కుటుంబం అందరూ కలిసి ఏదోఒక ప్రదేశానికి వెళ్ళి ఒక వారం రోజులు సరదాగా గడిపితే మనసుకి హాయిగా,ప్రశాంతంగా ఉంటుంది.అత్తమామలు.తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నట్లయితే వీలయినప్పుడల్లా వారితో మాట్లాడుతూ క్షేమ సమచారాలు తెలుసుకుంటూ ఉంటే వాళ్ళకు పిల్లలు దగ్గరలో లేరు అనే బాధ లేకుండా హాయిగా,ప్రశాంతంగా సంతోషంతో ఆరోగ్యంగా ఉంటారు.సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు.అందరికీ అదే వర్తిస్తుంది.
No comments:
Post a Comment