కళ్ళు అందంగా ఉంటే ముఖం మెరిసిపోతుంది.కళ్ళచుట్టూ నల్లటి వలయాలు,కళ్ళ క్రింద నలుపుదనం ఉన్నా ముఖం ఎంత అందంగా ఉన్నా ఏదో లోపం ఉన్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.పెళ్ళికో,పుట్టినరోజు పార్టీకో వెళ్ళాలంటే అప్పటికప్పుడు ఆప్రదేశంలో చర్మం రంగులో ఉండే కన్సీలర్ రాస్తే సరిపోతుంది.దీనికి రసాయనాలు ఉపయోగించని సహజసిద్ధమైన పరిష్కార మార్గం ఏమిటంటే వేపాకుల పొడి అందుబాటులో ఉంటే కొంచెం చేతిలో వేసుకుని సరిపడా నీళ్ళు పోసి దాన్ని కళ్ళచుట్టూ రాసి ఒక పదిహేను ని.ల తర్వాత కడిగేయాలి.లేదంటే ఒక బంగాళదుంప ముక్కను మెత్తగా తురిమి రసం పిండి ఆరసాన్ని కళ్ళ చుట్టూ రాస్తుంటే క్రమంగా నలుపు తగ్గిపోతుంది.
No comments:
Post a Comment