లాలస ఇంటికి దూరపు బంధువు వచ్చింది.ఆవిడకు మర్యాద చెయ్యడం కోసం ముఖ్యమైన పనిమీద వెళ్తూ కూడా ఉల్లిపాయ పకోడీ వేసి టీ పెడదామనుకునే సరికి అమ్మాయ్ నేను బెల్లం టీ తప్ప తాగను నాకు బెల్లం టీ ఇవ్వమంది.సరేనని మిగతా అందరికీ పంచదార కలిపి ఆమెకు మాత్రం బెల్లం తురిమి టీ లో వేసి కాచి ఇచ్చింది.మొదటిసారి పెట్టినా కానీ భలే పెట్టావు అంటూ నువ్వు కూడా రుచి చూడు ఎంత బాగుంటుందో ఒకసారి తాగితే వదిలిపెట్టవు అంటూ బలవంతపెట్టి తాగే వరకూ వదలలేదు.లాలసకు టీ తాగే అలవాటులేదు.దానికి తోడు బెల్లం టీ తాగమని కూర్చుంది అని మనసులో తిట్టుకుంటూ కొంచెం తాగింది.రుచి ఫర్వాలేదనిపించింది.ఈ బెల్లం టీ గోల ఏమిటో?ఎదుటివాళ్ళను తాగమని బలవంతం చేయటమేమిటో?విచిత్రమైన బంధువు అనుకుని లాలస తన పనిమీద తను వెళ్ళింది.
No comments:
Post a Comment