దేశ భాషలందు తెలుగు లెస్సఅని ప్రాచీన కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.అన్ని భాషల్లోను తెలుగు భాష లెస్స అనేది నేటి మాట.భాషలన్నింటిలోనూ తెలుగు భాష నేర్చుకోవటం చాలా తేలిక. ఇతర భాషల వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి,తేలిగ్గా నేర్చుకుంటున్నారు.తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ ఒక్కటే.తెలుగు రచయితలు,భాషాభిమానులతోపాటు ప్రపంచ దేశాలనుండి ఎంతోమంది అభిమానంతో నేటి నుండి విజయవాడలో జరిగే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యారు.అంతర్జాలంలో తెలుగు సాహిత్యం,తెలుగు లిపి విస్తృతస్థాయిలో గూగుల్ సంస్థ సహకారంతో అందుబాటులోకి వచ్చింది.అందుకు గూగుల్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
No comments:
Post a Comment