నిన్నటి కంటే ఈరోజు,ఈరోజు కంటే రేపు,రేపటి కంటే ఎల్లుండి బాగుండాలని సహజంగా అనుకుంటాము.అలాగే భవిష్యత్తు అంతా సంతోషంగా,సుఖంగా సాగిపోవాలని అందరమూ మనస్పూర్తిగా కోరుకుంటాము కదా!అలా సాగిపోవాలంటే భగవంతుని దయతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి.సానుకూల దృక్పధంతో అందుకు తగిన కృషి చేయాలి.నాలుగు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఆయాచితంగా ఎదుటివాళ్ళ నుండి దోచుకుందామని దానితో జల్సాగా బ్రతుకుదామని అనుకునేవాళ్ళే ఎక్కువమంది ఉంటున్నారు.అది తాత్కాలికమే కానీ ఎల్లకాలమూ అదే విధంగా జరగదని,తమ భవిష్యత్తు ముందు ముందు అగమ్యగోచరమని తెలిసినా తమ కుటిల ప్రయత్నాలు మానుకోలేరు.ఎప్పుడైనా ఎవరికి వారు వాళ్ళ స్వయంకృషితో,సానుకూల ధృక్పదంతో ఆలోచించి తమ స్వశక్తిని నమ్ముకుని సంపాదించిన సొమ్ముతో సుఖంగా,సంతోషంగా ఉండగలరు.అటువంటి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన ఠీవి,దర్జా ప్రస్పుటంగా కనిపిస్తూ ఉంటుంది.అటువంటి వాళ్ళ భవిష్యత్తు అంతా సుఖంగా,సంతోషంగా సాగిపోతుంది.
మన మానసిక చింతన సానుకూలం ఐతే భవిష్యత్తు సానుకూలం .నీతితొ నిజాయితీ తో ఆలోచనలు వుంటే భవిష్యత్తు బంగారమే !అభిప్రాయాన్ని బాగా తెలిపారు .
ReplyDelete