రాహుల్ వయసు నిండా పదేళ్ళు కూడా ఉండవు.పెద్దపెద్ద మాటలు మాట్లడుతుంటాడు.అమ్మ,నానమ్మ వాడికి ఇష్టమైన పదార్ధాలు వండి వేడివేడిగా భోజన సమయానికి ప్రత్యేకించి ఒక అతనితో పాఠశాలకు ఇచ్చి పంపుతుంటారు.వాడేమో స్కూలులో తినకుండా ఇంటికి తీసుకొచ్చి సాయంత్రం అదే తింటానంటున్నాడు.అదేమిటిరా?ఆ విధంగా తినకూడదు.సాయంత్రం పండ్లు తినాలి.లేదంటే నీకు ఏది ఇష్టమైతే అది తిను అంతే కానీ స్కూలులో తినకుండా ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావు?అదీకాక ఎటూ కాని సమయంలో చల్లారిపోయినది తినటం ఏమిటి?అని వాళ్ళ అమ్మ అడిగితే వృధాగా పారేయటం ఎందుకని తింటున్నాను.అయినా నువ్వుగట్టి గట్టిగా మాట్లాడుతున్నావు.పక్కింటి వాళ్ళకు వినపడుతుంది.పరువు పోతుంది అన్నాడు రాహుల్.పరువు అంటే ఏమిటో వాడికి అర్ధం తెలిసినట్లు పెద్ద ఆరింద లాగా మాట్లాడుతున్నాడు.
No comments:
Post a Comment