రామలక్ష్మి కొడుకు,కూతురు చదువు నిమిత్తం విదేశాలలో ఉంటున్నారు.కూతురు వెళ్ళినప్పుడు అంతగా అనిపించలేదు కానీ కొడుకు వెళ్ళినప్పుడు చాలా భాధ పడింది.ఎంత బాధ అంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా శూన్యంలోకి చూస్తున్నట్లు కూర్చునేది.ఒకరోజు స్నేహితురాలు ఫోనులో కూడా సరిగా మాట్లడటంలేదని రామలక్ష్మిని చూచి వెళ్దామని వచ్చింది.కొడుకు చిన్నప్పటి ముంజేతి కంకణం పెట్టుకుని చిక్కిశల్యమై పిలిచినా వినిపించుకోకుండా ఏటో చూస్తుంది.ఏమిటి అలా తయారయ్యావు?పిల్లలు వృద్ధిలోకి రావటమే కదా!మనకు కావలసింది.రోజూ ఫోనులో మాట్లాడుతూనే ఉంటావు.ఇంత బేలగా తయరయ్యావేమిటి?హుషారుగా ఉండాలి కానీ అనేసరికి బావురుమని ఏడ్చింది.అమ్మాయి వెళ్ళినా అబ్బాయి దగ్గరే ఉన్నాడు కనుక అంత బెంగ అనిపించలేదు.పెద్దాడయినా రోజూ కాసేపు ఒడిలో కూర్చుని కబుర్లు చెప్తే కానీ వాడికీ,నాకు నిద్ర పట్టేదికాదు.అందుకే వాడు నాదగ్గరే ఉన్నభావన కలగటానికి వాడి చిన్నప్పటి కంకణం వెతికి పెట్టుకున్నాను అని చెప్పింది.
No comments:
Post a Comment