వేగంగా నడవడం,మామూలుగా నడవడం,పరుగెత్తడం,జిమ్ కి వెళ్ళడం సర్వ సాధారణంగా చేసే వ్యాయామాలు.ఇప్పుడు చాలామంది జుంబా నృత్యాన్ని వ్యాయామంగా ఎంచుకుంటున్నారు.అయితే ఇది చాలా నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగాన్ని పెంచుకుంటే నేర్చుకోవటం చాలా సులువు.శరీరాన్ని వేగంగా కదిలిస్తూ చేసే నృత్యంతో కూడిన వ్యాయామం కనుక తరగతులకు వెళ్ళే ముందు అంతర్జాలంలో వీడియోలు చూసి సాధన మొదలు పెడితే అడుగులు వేయడం,చేతులు తిప్పడం,కాళ్ళ కదలికల వంటివి తెలుస్తాయి.తరగతులకు వెళ్ళినా అందరిలో చేయడానికి మొహమాటంగా అనిపించదు.అదీకాక తేలికగా కూడా నేర్చుకోవచ్చు.జుంబాలో తప్పటడుగులు సర్వ సాధారణం.మొదట్లో ఎవరైనా తప్పులు చేయటం సహజం. సంగీతాన్నిబట్టి మనం భంగిమను వెంటనే మార్చేయాల్సి ఉంటుంది.అమ్మో!మనం ఆవిధంగా చేయలేమేమో అని భయపడనక్కరలేదు.భయాన్ని వీడి నృత్యం మీద దృష్టి పెట్టి చేస్తే అదే అలవాటయిపోతుంది.సంగీతం ఏకాగ్రతగా వింటూ నృత్యంతో కూడిన వ్యాయామం జుంబా ప్రత్యేకత.ఇది నేటి ట్రెండ్.
No comments:
Post a Comment