మనలో చాలా మందికి కాసేపు తీరిక దొరికితే చాలు టి.వి.చూడటమో లేదా పుస్తకం చేత్తో పట్టుకుని కుర్చోవటమో అలవాటు.రోజులో ఎక్కువ సమయం కదలకుండా కూర్చోవటం వల్ల శ్వాస,గుండె కొట్టుకునే వేగం తగ్గి రక్తప్రసరణ తగ్గుతుంది.ఈమార్పులు నిస్తేజాన్ని సూచిస్తాయి.మన శరీరానికి సరిగా ప్రాణవాయువు అందకపోయినా నిస్సత్తువ ఆవరిస్తుంది.దీనితో ఇతర సమస్యలు మొదలవుతాయి.అందుకే ఒకేప్రదేశంలో ఎక్కువ సమయం కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి తిరుగుతూ అప్పుడప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి.తీరిక దొరికితే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచవచ్చు.దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.ఒత్తిడి తగ్గితే అసంకల్పితంగా ఏ అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.దీనితో మనం దాదాపు సంపూర్ణ ఆరోగ్యం అంది పుచ్చుకొన్నట్లే.
No comments:
Post a Comment