ఏదైనా లక్ష్యం సాధించాలని అనుకున్నప్పుడు మనం గెలుస్తామనిగానీ, ఓడిపోతామనిగాని మనకు ముందే తెలిస్తే మనం మానసికంగా అందుకు అనుగుణంగా తయారవుతాము.అదే విధంగా ఒక్కొక్కసారి తప్పకుండా గెలుపు మనదే అనుకుని చివరి క్షణంలో అనుకోకుండా ఓడిపోతే ఆ బాధ వర్ణనాతీతం.ఒక్కసారిగా ప్రాణం ఉసూరుమనిపిస్తుంది.ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మరలా ప్రయత్నించి చూడాలి.ఇలా దగ్గరదాకా వచ్చి తప్పిపోయిన గెలుపు మనలో తప్పకుండా సాధించి తీరాల్సిందే అనే పట్టుదలను పెంచి గెలిచేందుకు దోహదపడుతుంది.అప్పుడు తప్పకుండా విజయం మన స్వంతమవుతుంది.
No comments:
Post a Comment