ఉదయాన్నే పెదనాన్నగారి అమ్మాయి ఫోన్ చేసి గుళ్ళో గోదాదేవి రంగానాధస్వామి కళ్యాణం జరుగుతుంది.మీరు చేస్తారా?అని అడిగింది.భగవత్సంకల్పం.మాకు అనుకోకుండా దక్కిన అదృష్టంగా భావించి సరేనని చెప్పాము.పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం మేళతాళాలతో తలంబ్రాలబియ్యం,కల్యాణానికి అవసరమైనవన్నీ తీసుకుని పిల్లలు,పెద్దలు,ముత్తైదువలు అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి రంగరంగవైభవంగా గోదాదేవికి రంగనాధస్వామికి కళ్యాణం జరిపిచడం జరిగింది.ఆద్యంతముస్వామి,అమ్మవార్లకళ్యాణం కన్నులపండువగా జరిగింది.అప్పటికప్పుడు అనుకున్నా ఏర్పాట్లన్నీ ఘనంగా,సంతృప్తికరంగా ఉన్నాయి.దేముడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా!అందరూ దగ్గరుండి తల ఒక పని చేశారు.మాకూ ఎంతో సంతోషంగా,సంతృప్తిగా అనిపించింది.
No comments:
Post a Comment