స్వరాజ్యం చిన్నప్పుడు ఇంట్లో కరెంటు ఉండేది కాదు.ఒకరోజు పెద్దవాళ్ళందరు ఆరుబయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.స్వరాజ్యం లాంతరు ఒత్తి పెద్దది చేద్దామని వెళ్ళింది.వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు పాము కనిపించలేదు.తర్వాత పెద్ద వెలుగులో తనకు నాలుగు అడుగుల దూరంలోపాముని గమనించి భయంతో బయటకు పరుగు తీసింది.బయట కూర్చున్నవాళ్ళందరూ కర్రలు తీసుకుని లోపలకు వచ్చారు.పాము ఎక్కడా కనిపించలేదు.చివరకు మట్టికుండకు చుట్టుకుని ఉంది.కుండను కదిలించినా కుండతోపాటు పాము గట్టిగా చుట్టుకోవటంవల్ల ఇవతలకు రావటంలేదు.చివరకు ముల్లుకర్ర తీసుకొచ్చి లాగి చంపేశారు.ఉల్లుపాము చిన్నగా ఉంటుంది కానీ అది 'ఉఫ్' అని ఊదితే దాని వంటిమీద ఉన్న మచ్చల్లాగే మనుషుల శరీరం మీద వచ్చి పొరలుగా ఊడిపోతాయట.పిల్లను ఊదిందేమో 20 రోజులు జాగ్రత్తగా చూచుకోమని వీభూది మంత్రించి ఒకాయన చెప్పారు.ముగ్గురు అన్నదమ్ములకు మగపిల్లలు ఉన్నారు కానీ స్వరాజ్యం ఒక్కతే ఆడపిల్ల.అమ్మో!ఈపిల్లకు ఏమన్నా అయితే ఏమి చెయ్యాలి?అని అందరూ ఒకటే ఏడుపు.20 రోజులు పిల్లను ఒకళ్ళు విడిచి ఒకళ్ళు కాపలా కాశారు.చివరకు 20 రోజుల తర్వాత స్వరాజ్యం బాగానే ఉందని ఊపిరి పీల్చుకుని అందరూ సంతోషించారు.
No comments:
Post a Comment