వసంత చలాకీగా ఉంటుంది.తరతమ భేదం లేకుండా అందరింటికి ఏ చిన్నదానికైనా ఎంత దూరమైనా,భర్త పనుల ఒత్తిడి కారణంగా రాలేకపోయినా, తానొక్కతే అయినా వెళ్ళివస్తుండేది.సాయంత్రమైతే చాలు దగ్గరలోని గుడిలో భజన కార్యక్రమానికి,దైవ సంకీర్తనకు వెళ్తుండేది.అటువంటిది ఒకరోజు బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళి అక్కడ ఉన్నట్టుండి క్రింద పడిపోయింది.అక్కడితో ఆమె మరి మాట్లాడలేక గొంతు మూగబోయింది. వైద్యులు ఆమె మరి మాట్లాడలేదని తేల్చి చెప్పేశారు.అయినా తనకు అవసరమైనవి పుస్తకంలో రాసి చూపించేది. తాను చనిపోతానని తెలుసు కనుక పిల్లలకు తెలియదని తన కర్మకాండలకు అందరినీ పిలవమని బంధువులందరి పేర్లు పుస్తకంలో రాసి ఉంచింది.పిల్లలు ఆవిషయం చెప్పి బాధపడుతుంటే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.ఎక్కడున్నా అందరూ వచ్చిఅశ్రునయనాలతో ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.
No comments:
Post a Comment