నీరజకు బోన్సాయ్ మొక్కలంటే చెప్పలేనంత ఇష్టం.ఎక్కడ మొక్కల ప్రదర్శన పెడితే అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళిబోన్సాయ్ మొక్కలు తీసుకొచ్చేది.దానికి తోడు రకరకాల పింగాణీ కుండీలలో అందంగా పెట్టేది.పాతఇల్లు స్థానంలో కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో దగ్గరలో ఉన్న అపార్టుమెంటుకు వెళ్లారు. అక్కడి వాళ్ళకు మొక్కలన్నీ తెచ్చిపెట్టడం ఇష్టం లేదు.పైకి తీసుకెళ్ళి పెట్టుకోమని చెప్పారు.పైకి వెళ్ళి రోజూ నీళ్ళు పొయ్యాలంటే ఇబ్బందయినా పోనీలే నాలుగురోజులు ఎలాగో కష్టపడవచ్చులే అనుకుంది.ఇంతలో మనవడు పుడితే అమెరికా వెళ్ళాల్సి వచ్చింది.వెళ్ళి వచ్చేటప్పటికి ఒక్క మొక్క కూడా లేదు.దొంగతనం జరిగితే డబ్బో,నగలో తీసుకెళ్తారుగానీ ఈరకంగా బోన్సాయ్ మొక్కలు దొంగతనం జరగటమేమిటని ఎవరినడిగినా మాకు తెలియదంటున్నారు.నీరజ వెళ్ళేటప్పుడు వాచ్ మెన్ కి డబ్బులిచ్చి మొక్కలకు నీళ్ళు పొయ్యమని చెప్పింది.వాచ్ మెన్ కూడా కనిపించలేదు.నాలుగురోజుల తర్వాత బజార్లో వాచ్ మెన్ కనిపించి మొక్కలన్నీఎక్కడికో తరలించారని,నేను మీతో చెప్తానని నన్ను పనిలోంచి తీసేశారని చెప్పాడు.హవ్వ!ఇదేమి పోయేకాలం?ఇష్టం లేకపోతే మొదటే వద్దని చెప్పాలి కానీ మొక్కలపై కక్ష కట్టినట్లు పిచ్చిపనులు ఏమిటి?ఛీ!భూమి మీద ఇటువంటి విచిత్రమైన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అనిపించింది.
No comments:
Post a Comment