అమెరికాలో ప్రతి పది ని.ల కొకసారి రోడ్డు దాటి వెళ్ళేవాళ్ళ కోసం సిగ్నల్ వస్తుంది.ఒకవేళ సిగ్నల్ లేనిచోట కూడా రోడ్డుదాటి ఎవరైనా వెళ్తుంటే వాహనాలు ఆపేసి అందరూ వెళ్ళిన తర్వాత మాత్రమే వెళతారు.సుష్మ బంధువులు ఇక్కడ మనదేశంలో లాగా కాదు.నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే జీవితాంతం జైల్లో శిక్ష అనుభవించాల్సిందే.తప్పించుకోవటానికి కుదరదు.ఈవిషయంలో గవర్నమెంటు చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు.ఇక్కడి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ చక్కగా పాటిస్తారు.ఎంతటి వాళ్లయినా వాహనాలను ఒకచోట పెట్టి అవసరమైన చోటకు నడిచి వెళ్ళాల్సిందే.నడిచి వెళ్ళేవాళ్ళకు ముందు ప్రాముఖ్యతనిస్తారు.గజిబిజి లేకుండా అన్ని వాహనాలు వెళ్తున్నాఏ శబ్దాలు లేకుండా, అమ్మో!రోడ్డు దాటుతుంటే ఉంటామో,పోతామో అనే భయం లేకుండా ప్రశాంతంగా ఉంది.సుష్మకు ఎప్పటికైనా మన దేశంలో కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనిపించింది.
No comments:
Post a Comment