శ్రీనిజ మిగతా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటుంది.కానీ బల్లంటే చాలా భయం.ఒకరోజు కార్యాలయం నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆలస్యమైంది.తలుపు తీయగానే అకస్మాత్తుగా బల్లి క్రింద పడింది.దాన్ని చూచి కెవ్వు,కెవ్వు అంటూ కేకలు పెడుతూ తను కూడా క్రింద పడిపోయింది.అసలే బొద్దుగా ఉంటుందేమో రెండు చేతులమీద బరువు పడి చేతులు,నడుము అయితే విరగలేదు కానీ వేళ్ళ ఎముక ఒకటి చిట్లి కట్టు వేశారు.ఇంకొక చేతికి గట్టి దెబ్బ తగిలింది.వృత్తిరీత్యా కుడి చేతితో పని చేయాలి కనుక కట్టు మధ్యలోనే తీసేసింది.అందువల్ల నొప్పి తగ్గలేదు.వారిజ వెళ్ళేటప్పటికి పనిఅమ్మాయితో చెయ్యి నొక్కించుకుంటుంది.ఏమైదని అడిగితే బల్లిని చూచి భయం వేసి క్రింద పడ్డాను అని చెప్పి కాదు కాదు బల్లి నన్ను క్రింద పడేసిందని చెప్పింది.
No comments:
Post a Comment