కలబంద మనకు ప్రకృతి ప్రసాదించిన అత్త్యుత్తమమైన మొక్క.ఇది బహుళ ప్రయోజనకారి. మనం ఇంటికి కొత్తగా రంగులు వేసినప్పుడు రంగుల తాలూకు వాసనలు చాలా రోజులవరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అటువంటప్పుడు కలబంద మొక్కలను కుండీలలో పెట్టి అక్కడక్కడ గదుల్లో ఉంచితే గాలిలో ఉండే హానికారక రసాయనాలను శుద్ధి చేస్తుంది.రంగుల వాసన త్వరగా పోతుంది.ఇది రాత్రిపూట కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది.అందువల్ల దీన్ని పడకగదిలో పెట్టుకుంటే మంచిది.కలబంద వంటగదిలో కూడా ఉండాల్సిన మొక్క.కూరగాయలు కోసేటప్పుడు ఎక్కడైనా తెగినా,వంట చేసేటప్పుడు కాలినా వెంటనే కలబంద చిన్న ముక్క కోసి దానిలోపల ఉన్న జిగురు పదార్ధాన్ని రాస్తే రక్తం ఆగిపోతుంది,కాలినప్పుడు బొబ్బ రాకుండా ఉంటుంది.రోజు కలబంద చిన్నముక్క తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.ఇవేకాక ఇంకా చాలా ఉపయోగాలున్నాయి.మొత్తం మీద ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగకరం.
No comments:
Post a Comment