పూర్వం మన పెద్దలు ప్రతి రోజు పగలు,రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగు అన్నంతోపాటు (పెరుగు వాతం కనుక కొద్దిగా నీళ్లు పోసుకుని తినాలి అని పెద్దల ఉవాచ) కానీ,మజ్జిగ అన్నంతోపాటు కానీ ఒక పచ్చి ఉల్లిపాయ తప్పనిసరిగా ఆరోగ్యానికి మంచిదని తినేవాళ్ళు.పిల్లలకు కూడా చిన్న చిన్న ఉల్లిపాయలు వేసి పెరుగు అన్నం పెట్టేవాళ్ళు.ఇలా రోజూ రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డ తినేవాళ్ళు త్వరగా రోగాలబారిన పడరని చెప్పేవాళ్ళు.ఇప్పటి పరిశోదకులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు.అన్ని రకాల తాజా ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు,గింజలు మనం తింటూ పిల్లలకు కూడా అలవాటు చెయ్యాలి.నిత్యం ఒక అరగంట పాటు నడక,కాస్త తేలికపాటి వ్యాయామం చేస్తూ,మనసారా హాయిగా నవ్వుతూ,నవ్విస్తూ ప్రశాంతంగా ఉండాలి.కంటి నిండా సరిపడా నిద్ర పోవాలి.మన పెద్దలు ఇంతకు ముందు పెందలాడే భోజనం చేసి,పెందలాడే నిద్ర పోయి తెల్లవారుఝమునే నిద్ర లేచేవాళ్ళు.అదే అప్పటి వాళ్ళ ఆరోగ్య రహస్యం.ఉప్పు తగ్గించి నియమిత ఆహారం తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకుంటే నలభైలో కూడా ముప్పైలా కనపడుతూ నిత్య ఆరోగ్యవంతులుగా ఉంటారు.
No comments:
Post a Comment