మకర సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవిరకరకాలముగ్గులు,గొబ్బెమ్మలు,హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, కోడిపందేలు, గాలిపటాలు, చెరుకు గడలు, రేగిపళ్ళు, తేగలు, నువ్వులతో చేసిన అరిసెలు, రకరకాల పిండి వంటలు ఒకటేమిటి నెల రోజులు సందడే సందడి. తెల్లవారుఝామున లేచి ఆకాశంలో చుక్కలు ఉండగానే తులసి మొక్క వద్ద తిరుప్పావై పాసురాలు చదువుతూ చేసే పూజలు ఒక ఎత్తైతే చివరగా గోదాదేవి రంగనాధుల కళ్యాణం, గోపూజలతో ముగుస్తాయి. ముఖ్యంగా ఈ చివరి మూడు రోజుల పండుగ మరీ ప్రత్యేకం. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు పెద్దవాళ్ళతో స్వంత ఊరిలో సరదాగా గడపడం కోసం పిల్లలు ఎంత దూరంలో ఉన్నా సరే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఎక్కడెక్కడో ఉన్న మన తెలుగు వారందరికీ, పిల్లలకు, పెద్దలకు, నా బ్లాగు వీక్షకులకు, తోటిబ్లాగర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భోగి, మకరసంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మనందరికీ భోగి భోగ భాగ్యాలను, మకర సంక్రాంతి సుఖ సంతోషాలను, కనుమ కష్టాలను తొలగించి కమ్మని అనుభూతులను మిగల్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
As claimed by Stanford Medical, It's really the ONLY reason this country's women get to live 10 years more and weigh an average of 19 KG less than us.
ReplyDelete(Just so you know, it has totally NOTHING to do with genetics or some hard exercise and absolutely EVERYTHING related to "how" they are eating.)
BTW, I said "HOW", and not "WHAT"...
Click this link to see if this quick questionnaire can help you discover your real weight loss possibilities