గురువు అంటే జ్ఞానాన్ని పంచేవారు.పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవారే కాకుండా మానవతా విలువలు,లోకం పోకడ,మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియ చెప్పే ప్రతి ఒక్కరూ గురువులే.పిల్లలకు మొట్టమొదటి గురువు తల్లి.తర్వాత తండ్రి.తర్వాత పెద్దలు,మిగిలినవారు.పిల్లలను పాఠశాలలో చేర్చే వయసు వచ్చేటప్పటికి ముఖ్య పాత్ర ఉపాధ్యాయులది.మంచి పౌరులుగా తయారవడానికి మన వెనుక ఇంతమంది కృషి ఉండబట్టే మనం సమాజంలో మనగలుగుతున్నాము.అది గుర్తు పెట్టుకుని మనం ఈ ఒక్కరోజే అని కాకుండా ప్రతి రోజు జీవితంలో వీళ్ళందరినీ మరువకూడదు.గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్త్మై శ్రీ గురవే నమః అంటూ గురు పూజోత్సవం సందర్భంగా నాకు మంచి బుద్ధులు నేర్పించిన నా తల్లిదండ్రులకు,పెద్దలకు, విద్యను నేర్పిన ఉపాద్యాయులకు,ఆధ్యాత్మిక విలువలను నేర్పే గురువులకు నమస్సుమాంజలి.నా బ్లాగ్ వీక్షకుల్లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
Best movies website movie news
ReplyDelete