చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఏ కాలంలో అయినా ఉంటారు వినేవాళ్ళు ఉంటే ఎన్నయినా చెప్తూ ఉంటారు. చాడీలు చెప్పి సంసారాలు అల్లకల్లోలం చేస్తూ ఉంటారు,ఇప్పుడు ఇంటికి ఓక మంధర ఉంటుంది.తల్లిదండ్రులు గురించి, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు గురించి, మేనమామలు గురించి ఉన్నవి లేనివి కల్పించి పొద్దస్తమానం ఉద్యోగం చేసి ఇంటికి వఛ్చిన భర్త మెదడు తినేసి అనందంతో హాయిగా భర్తకు తిండి కూడా సరిగా పెట్టకుండా తాను మాత్రమే తిని నిప్పుపెట్టాను కదా!అదే రాజకుంటుందిలే అని బొజ్జునే అమ్మలక్కలు కోకొల్లలు.సరైన బాధ్యత కల భర్తలు అయితే ఒక నిముషం ఎంతవరకు సబబు అని అలోచించి తన పని తాను చూసుకుంటాడు. అదే భార్య ఏమిచెప్పినా గ్రుడ్డిగా నమ్మే అతి ప్రేమ గల భర్తలు అయితే కొంప కొల్లేరు అయిపోతుంది.ఒక నిముషం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఏమీ కాదు.పెద్ద చిన్న లేకుండా నోటికి ఎంత వస్తే అంత భార్య చెప్పిందని మాట్లాడితే పెద్దవాళ్ళ మనసు భాధ పడి గుండె ముక్కలైతే అతకడం కష్టం. ఏముందిలే నేను నా భార్య ఎవరు అవసరం లేదు అనుకుంటే ఒకటే మాట.కల్లబొల్లి కబుర్లలో ఎంత నిజం ఉందొ తెలిసినా కళ్ళకు మాయ అనే పొర కప్పేయడంతో ఏమీ చేయలేని పరిస్థితి. తెలుసుకునేసరికి ఒంటరితనం తప్ప ఏమీ ఉండదు.ఆమె తన తల్లిదండ్రులతో అధిక ప్రేమ ఒలకబోస్తూ భర్త తల్లిదండ్రులను దూరం చేయడం ఈనాటి కలియుగ మంధర యొక్క లక్ష్యం. కుటుంబం అంటే విలువలు తెలిసిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే ఈ కలియుగ మంధరల బారిన పడుతున్నారు. మనము అందరము ఒకటి అనుకుని ఎవరి ప్రాధాన్యత వారికి ఇస్తూ ఉంటే ఎంత గౌరవంగా ఉంటుంది.అందరి ప్రేమానురాగాలతో పిల్లలు ఎంత చక్కగా పెరుగుతారు.నేను నా పిల్ల ఒంటికాయ సొంటి కొమ్ము లాగా అనే పిచ్చి తల్లులు ఎక్కువైపోయారు..ఇటువంటి కలియుగ మంధరల మాటలు విని జీవితం నాశనం చేసుకోకూడదు అని అర్థం చేసుకుని ఎంత త్వరగా కళ్ళ మాయాపొర తొలగించుకుంటే అంతా త్వరగా మంధరకి కూడా జ్ఞానోదయం కలిగిస్తే సంసారం పచ్చని సంసారంగా మారుతుంది.
No comments:
Post a Comment