శంభులింగం,జంబులింగం ఇద్దరూ మేనత్త మేనమామ పిల్లలు.ఇద్దరూ వైద్యులు.
విదేశాలలో స్థిరపడ్డారు.ఇద్దరికీ ఎవరికి వారికి నేనే గొప్ప అని ఉంటుంది.ఒకరి గురించి ఒకరు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తుంటారు కానీ బంధువుల విషయంలో ఎవరికైనా సహాయం చేయాలంటే మొండిచెయ్యి చూపిస్తుంటారు.ఇద్దరిదీ ఒకే మాట.స్వంత అక్కచెల్లెళ్ళను ఒకసారి రమ్మని మాటవరసకు కూడా అని ఎరుగరు. శంభులింగం అక్క,బావ వెళ్దామని ఏనాడూ అనుకోలేదు కానీ జంబులింగం చెల్లి,బావ శతవిధాల వెళ్దామని ప్రయత్నించినా తీసుకెళ్ళలేదు.స్వదేశానికి వచ్చినప్పుడు మాత్రం చెల్లి కల్లబొల్లి కబుర్లు చెప్పి ఏడిస్తే డబ్బు ఇచ్చి వెళ్తాడు.ఇంకేముంది జంబులింగం మంచివాడంటారు ఊరిజనం.విదేశాలకు బంధువులు వెళ్ళాలని ఏదైనా సలహా అడిగినా తనను ఏమైనా సహాయం అడుగుతారేమోనని తప్పుడు సమాచారం ఇస్తుంటాడు.శంభులింగం తనను సహాయం అడిగే అవకాశం ఇవ్వకుండా సరయిన సమాచారం ఇస్తుంటాడు.శంభులింగం కన్నా జంబులింగం మంచివాడంటారు లోతుగా ఆలోచించని ఊరిజనం.తెలిసిన వాళ్ళు దొందూ దొందే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు.ఎవరికీ మాటసాయం కూడా చెయ్యరు అని శంభులింగం జంబులింగం లాంటివాళ్ళు అంటారు.
No comments:
Post a Comment