ఒకప్పుడు హాయిగా భర్త సంపాదించి పెడుతుంటే కూర్చుని తింటూ ఊసుపోక ఆడవాళ్ళందరూ కాలక్షేపానికి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనే చాలా మంది అభిప్రాయం.రోజులు మారాయి.ఆడపిల్లలందరూ చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసుకోవటమో,స్వంతంగా వ్యాపారాలు చేసుకోవటమో చేస్తూ ఆర్ధికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు.ఇది ఒక విధంగా చెప్పాలంటే మహిళలు సాధించిన విజయం.నేటి యువతరం మహిళలే కాకుండా భర్త,పిల్లలే లోకం అనుకున్నవాళ్ళు కూడా పిల్లల భాద్యతలన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ అభిరుచులకు,సృజనాత్మకతకు పదును పెట్టి దాన్ని వ్యాపారంగా మలుచుకుని కొందమందికి ఉపాధి కల్పిస్తూ నలుగురికి తమకు తోచిన సేవ చేస్తూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారు.ఇది నిజంగా హర్షించతగ్గ విషయం.
No comments:
Post a Comment