Sunday, 15 March 2015

చెవుల్లో సన్నని వైర్లు

                                          ఈ మధ్య ఎవరిని చూసినా పెద్ద,చిన్న తేడా లేకుండా చెవుల్లో రెండు సన్నని వైర్లు
వేలాడేసుకుంటున్నారు. ఫోను మాట్లాడుకోవటానికో,పాటలు వినడానికో ఏ కారణమైనాగానీ దీని వల్ల చెవులు దెబ్బతినే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వీటివల్లే చెవులకు వినికిడి సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు.ఇంతకు ముందు ఎక్కడన్నా ఒకళ్ళు వినికిడి యంత్రం ఉపయోగించేవాళ్ళు.ఇప్పుడు చాలా మంది   వినికిడి యంత్రాలతో కనిపిస్తున్నారు.శబ్దకాలుష్యం కొంత కారణమైతే కొంత మనం చేతులారా చేసుకుంటున్నది.ఏది ఏమైనా చెవుల్లో పెట్టుకుని వినే అలవాటు తగ్గించుకోవటం మంచిది.   

2 comments:

  1. చెప్పినా వినేవారు ఎంత మంది చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ.వినకపోయినా కొంతమంది అయినా ఆలోచనలో పడతారేమోనని ఆశ.

      Delete