భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.అప్పుడప్పుడు చిన్నచిన్న గొడవలు రావటం సహజం.వాటిని పెద్దవి చేసుకునేకన్నాఎప్పుడూ నాదే పైచేయిగా ఉండాలని అనుకోకుండా సర్దుబాటు ధోరణి కూడా అలవర్చుకుంటే గొడవలు సర్దుమణుగుతాయి.ప్రతిఒక్కరికి ఎవరి స్వంత అభిరుచులు,ఇష్టాలు వాళ్లకుఉంటాయి.వాటిని మరొకరు ఇష్టపడకపోయినా,గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ తేలిగ్గా ఎవరి దగ్గరా మాట్లాడకూడదు.తెలిసోతెలియకో అలా మాట్లాడటం వల్ల ఎదుటివారు బాధపడటమే కాక లేనిపోని గొడవలకు తెర దించినట్లవుతుంది.
No comments:
Post a Comment