జస్విక తొమ్మిదో తరగతి చదువుతుంది.ఎక్కువగా టి.వి,కంప్యూటరు దగ్గర కూర్చోవటం వల్ల కంటిచూపు మందగించి కన్ను ఎర్రబడుతుంది.వాళ్ళ నానమ్మ కంటి ఆసుపత్రికి వెళ్తూ జస్వికను కూడా వైద్యుని వద్దకు రమ్మంటే నాకు పరీక్షలు కనుక అట్టే సమయం లేదు రాలేనంది.సరేలే పిల్లను ఇబ్బంది పెట్టటం ఎందుకులే నేను కూడా తర్వాత వెళ్తానని నానమ్మ తన ప్రయాణం మానుకుంది.తర్వాతరోజు సెలవు ఉండటం వల్ల జస్వికకు పరిక్ష లేదు.జస్విక అమ్మ పరీక్షలన్ని రోజులు టి.వి ఇంట్లో చూడటానికి వీల్లేదని నిషేధాజ్ఞ జారీ చేసింది.అమ్మను మించినది పిల్ల కనుక పిన్ని ఇంటికి వెళ్దామని వంక పెట్టుకుని టి.వి చూడడానికి అందరినీ బయలుదేరదీసింది.అదే ఇంట్లో కొంచెంసేపు టి.వి చూడనిస్తే ఈ తిప్పలు ఉండవు కదా!పిల్లల్ని మరీ కట్టడి చేసినా ఇదే తరహాలో ఉంటుంది వ్యవహారం.పిన్నిరండి రండిఅంటూ నవ్వుతూనే నన్ను చూడటానికి ఈసమయంలో రారు కదా!దీనికి ఆసుపత్రికి వెళ్ళటానికి సమయం లేదు కానీ టి.వి చూడటానికి సమయం దొరికిందా?అంటూ చురక అంటించింది.అమ్మాకూతుళ్ళు కుక్కిన పేనుల్లా నోటమాట రాకుండా ఉండిపోయారు.
No comments:
Post a Comment