పార్వతమ్మకు ఎనభై ఐదు సంవత్సరాలు.వయసురీత్యా అరవై సంవత్సరాలకు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి.ఆపరేషన్ అంటే ఉన్న భయం వల్ల ఒక ఐదు సంవత్సరాలు ఎలాగోలా ఇబ్బంది పడింది. కొడుకు కుటుంబం విదేశాలలో ఉంటుంది.పిల్లలు అంత దూరం నుండి వచ్చినా నాచేతితో వండి పెట్టలేక పోతున్నానని,చెప్పినా వినకుండా కొడుకు కుటుంబం వచ్చేలోపల ఆపరేషన్ చేయించుకోవటానికి వెళ్ళింది.మోకాళ్ళకు ఆపరేషన్ బానే జరిగినా దురదృష్టవశాత్తూ చూపు కోల్పోయింది.కొడుకు వైద్యుడు నేను వచ్చిన తర్వాత చేయిద్దాం అన్నా వినకుండా కొడుకు వచ్చేసరికి తను మునిపటిలా చలాకీగా తిరిగి పనులు చేసుకోవాలని అనుకుంది.తనకొచ్చిన కష్టానికి మొదట్లో చాలా బాధపడింది.క్రమంగా అలవాటుపడి వాకర్ తో నడుస్తూ,పనివాళ్ళపై అజమాయిషీ చేస్తూ,వంటమనిషి వండినది నచ్చక కూరల్లో ఉప్పు,కారం,టీలో పంచదార,టీపొడికూడా తనే కావలసినంత వేయిస్తుంది.దగ్గర బంధువుల చరవాణి నంబర్లు ఒకటికి రెండు సార్లు చెప్పించుకుని గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు తనే ఫోన్ చేస్తుంటుంది.ఈవయసులో కూడా ఆమె జ్ఞాపకశక్తి అమోఘం.ఎవరి ఫోను నెంబరు కావాలన్నా పార్వతమ్మ గారిని అడగండి అని అందరూ అంటారు.అదీకాక తనకొచ్చిన కష్టాన్ని అధిగమించి ఇప్పటికీ తనపనులు తానే చేసుకుంటూ ఇంటికి ఎవరైనా ఫోను చేస్తే ముందుగా తనే గబగబా వచ్చి మాట్లాడుతుంది. కనిపించకపోయినా టీ.వి పెట్టుకుని వార్తలు వింటూ ఏరోజు జరిగిన వార్తలు ఆరోజు తెలుసుకుంటుంది.
No comments:
Post a Comment