మన భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అందరూ కలిసి కట్టుగా ఉండడమే మన సంప్రదాయం.అందులో మన దేశానికి రెండు కళ్ళు రైతులు,సైనికులు .దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో ప్రకృతి విపత్తుల వలన కానీ,మానవ తప్పిదాలవలన కానీ వారికి సరైన ప్రతిఫలం లభించడం లేదు. ఏది ఏమైనా ఇప్పటి నుండి అయినా భగవంతుని దయవలన అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ,భారతీయురాలిగా పుట్టినందుకు గర్విస్తూ,మన దేశాన్ని ప్రేమిస్తూ మన భారతీయులందరికీ జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
No comments:
Post a Comment