Monday, 20 April 2026

ఆరోగ్యానికి ఆరోప్రాణం

                                             ఆరోగ్యానికి ఆరోప్రాణం పీచు పదార్ధం. మనము ఇంటిని శుభ్రం చేసుకున్నట్లగానే మన ఒంటిని శుభ్రం చేసే పోషక పదార్ధమే పీచు పదార్ధం. పేగుల్ని, రక్తనాళాల్ని శుభ్రం చేస్తూ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్ధాల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇదే కాకుండా మలబద్ధకం, క్యాన్సర్ వంటి జబ్బులు దరి చేరనివ్వదు. పీచు పదార్ధం తగినంత అందాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు,తృణధాన్యాలు, ఓట్స్, బీన్స్, కందిపప్పు, చిక్కుడు గింజలు, శనగలు మొదలైన వాటిల్లో ఎక్కువగా ఉంటుంది.నిమ్మజాతి పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు, బార్లీ,, గోధుమలు, జొన్నలు, రాగులు, మొక్కజొన్న, దోసకాయలు, చిలకడ దుంపల్లో ఉంటుంది. బాదం, వానట్లు, పొద్దుతిరుగుడు, చియా గింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది.రోజు పండ్లు, కూరగాయలు, గింజలు అన్నీ సమంగా ఉంటే పీచు బాగా అందుతుంది. వీటితోపాటు నీళ్లు బాగా తాగితే ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుండి రాగి జావ, పప్పులతో కిచిడీ వంటివి ఆహారంలో భాగం చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనంత పీచు లభిస్తుంది. జీవనశైలి మార్పులతో వచ్ఛే అనేక రోగాలకు అడ్డుకట్ట వేయగలము. ఈ చిన్నమార్పుతోనే ఎంతో లాభాన్ని పొందవచ్చు.

No comments:

Post a Comment