Monday, 4 May 2026

వేసవిలో చల్లచల్లగా బార్లీ

                                                    బార్లీ వలన అనేక ఉపయోగాలున్నా కూడా దీనిని వాడడానికి అందరూ ఇష్టపడరు. బార్లీ గింజలు ఉడికించి వడకట్టి ఆ నీటిని త్రాగడం వలన శరీర వేడి తగ్గి చలువ చేస్తుంది అని ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అమ్మ చెప్పింది..మూత్రపిండాలు,మూత్రనాళ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.బార్లీ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం రానివ్వదు. గర్భిణీ స్త్రీలకు కాళ్ళు వాపులు రాకుండా ఉంటాయి. రక్తంలో చక్కర స్థాయిల్ని నియంత్రిస్తుంది.బరువు తగ్గాలనుకకునేవారు సైతం బార్లీ ఏదో ఒక రూపంలో వాడితే కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గుతారు.చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. బార్లీ నీళ్లతో ముఖం కడిగితే మొటిమలు,మచ్చలు పోతాయి. బార్లీ గింజలు ఉడికించి నీళ్లు త్రాగి ఆ గింజలతో ఉప్మా, కిచిడీచేసుకోవచ్చు. ఉడికిన గింజలు మిక్సీలో వేసి కొద్దిగా బియ్యప్పిండి,ఉల్లి, పచ్చిమిర్చి,అల్లం, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి అన్నీ కలిపి వడలు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. అమ్మ బార్లీ వడలు వేస్తుంది.పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.ఇంకెందుకు ఆలస్యం బార్లీని ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యం స్వంతం చేసుకుందాము.

No comments:

Post a Comment