Tuesday, 23 December 2014

తాగితే మనిషి ప్రవర్తన

                                              సరస్వతి భర్త ముఠా మేస్త్రి.సాయంత్రం రోజూ తాగేసి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు.పిల్లలమొహాలు చూచి ఎన్ని భాధలు పెట్టినా ఓర్చుకునేది.ఒకసారి బాగా తాగి ఇంటికి వచ్చి సరస్వతిని నానా మాటలు అని,కొట్టి ఆమైకంలో ఏమి చేస్తున్నాడో కూడా ఒళ్ళు తెలియని స్థితిలో చెయ్యి పట్టుకుని ముంజేతిని మెలితిప్పేశాడు.సరస్వతికి మొదట ఏమీ అర్ధం కాలేదు.ముంజేయి వేలాడిపోయిండి.ఎదిరించడానికి తగిన శక్తి లేక ఏడవటం మొదలుపెట్టింది.కాసేపటికి తలకెక్కిన మత్తు దిగి భార్య చెయ్యి వాచిపోయేసరికి మందుబిళ్ళ తెచ్చి వేశాడు.తర్వాత రోజు వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది.ఎముక విరిగి లోపల నుజ్జు నుజ్జు అయింది.వెంటనే అయితే ఏమైనా చేయగలిగేవాళ్లము.ఇప్పుడు ఏమీ చేయలేము అని చెప్పారు.పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నాఇంకా అర్ధం చేసుకోకుండా తాగి కొట్టడం, పిచ్చిచేష్టలు ఎక్కువయ్యాయని విసుగొచ్చికన్నవారింటికి వెళ్ళిపోయి నాటు వైద్యం చేయించుకుంది.ఎముక సరిగ్గా అతకక ఇప్పటికీ పని ఎక్కువైతే నొప్పివస్తుంటుంది.భార్య దగ్గరకు వెళ్ళి బ్రతిమాలి,ఇంక తాగనని ఒట్లు పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు.వచ్చింది కానీ సరస్వతి భర్తకు అన్నం కూడా పెట్టకుండా మాట్లాడటం మానేసింది.ఒక నెల పెద్దగా మార్పు లేదు కానీ తర్వాత తనంతట తానే తాగటం మానేశాడు.భార్యాబిడ్డలను బాగా చూచుకుంటాడని నమ్మకం కుదిరిన తర్వాత సరస్వతి మామూలైంది.అసలు మారతాడనుకోలేదు. నాచెయ్యి విరిచేస్తే కానీ మాఆయనకు జ్ఞానోదయమవలేదు.తాగితే మనిషి ప్రవర్తన ఎలాగుంటుందో నాకు మాఆయన సినిమా చూపించాడు అని సరస్వతి తెలిసినవాళ్ళకు చెప్తూఉంటుంది.          

No comments:

Post a Comment