కిట్టు పెద్ద కేటుగాడు.అందర్నీ ఏదోరకంగా మోసంచేసి ఎలాగైతే రెండంతస్తుల ఇల్లు కట్టాడు.క్రింద అమ్మానాన్నా,మొదటిదానిలో కిట్టు,రెండవదానిలో కొడుకు ఉంటారు.కిట్టుని మించిన కేటుగాడు కొడుకు.అమ్మ,భార్యఏదైనా పని చేయమన్నప్పుడు పైన ఉన్నప్పుడు భార్య మాట విన్నట్లుగా భార్య చెప్పినదే వేదంలా చేస్తాడు.క్రిందికి వచ్చినప్పుడు అమ్మ చెప్పిన మాట విన్నట్లుగా అమ్మ మాట జవ దాటని వాడిలాగా నటిస్తాడు.ఇద్దరి దగ్గర మంచివాడిననిపించుకోవటానికి ఎన్ని వేషాలు వెయ్యాలో అన్ని వేషాలు వేస్తాడు.చివరికి ఇద్దరి మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడు.ఏదో ఒకసారైతే ఎవరైనా సర్దుకోగలరు కానీ ఎల్లప్పుడూ సర్దుకోలేరు కదా!అందుకే ఇద్దరూ కలిసి కిట్టుని కేటుగాడని అర్ధం చేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారు.
No comments:
Post a Comment