రాజ్యశ్రీ కొత్తగా పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళింది.ఆఊరిలో కొన్నిపదాలు వేరేగా పలుకుతారు.
అది చలికాలం.అత్తగారింట్లో తెల్లవారుఝామునే అందరూ లేచే అలవాటు.అందరూ ఎవరిపనులు వాళ్ళు హడావిడిగా చేసుకుంటుంటే తను నిద్రపోవటం బాగుండదని తప్పనిసరిగా లేచి వరండాలోకి వచ్చింది.ఇంతలో వాళ్ళ అత్తగారు కనిపించి ఆరుబయట బాగా మనుసు పడుతోంది కానీ ఇప్పటినుండి మనుసులో ఎందుకు తిరగటం?కాసేపు పడుకో అన్నారు.రాజ్యశ్రీకి మొదట మనుసు పడటమేమిటో అర్ధం కాలేదు.అడగటం బాగుండదు కదా!అందుకని ఆరుబయట మనుసు పడుతుంది అంటే మంచు కురుస్తోంది కాబోలు అని అర్ధం చేసుకుంది.తర్వాత భర్తనడిగి తన తన సందేహాన్ని నివృత్తి చేసుకుంది.

No comments:
Post a Comment