సౌరబ్ పొలాలు కొనుక్కోవటానికి వెళ్తూ చూడటానికి తమ్ముడిని కూడా రమ్మన్నాడు.తమ్ముడు ఇంకో ఇద్దరు తన శ్రేయోభిలాషులను వెంట తీసుకొచ్చాడు.సౌరబ్ భార్య పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్లుగా వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్తున్నారేమిటి?అంది.సౌరబ్ అదే సందేహాన్నివ్యక్తపరిస్తే సౌరబ్ తమ్ముడు వాళ్ళు చాలా మంచివాళ్ళు.మన మంచికోరతారు అని చెప్పాడు.సరే చూద్దామని వీళ్ళుకూడా ఏమీ మాట్లాడలేదు.పొలం చాలా బాగుందని నలుగురూ అనుకున్నారు.పొలం అతను మానాన్నగారిని కూడా పిలిపించి రేపు మాట్లడుకుందామని చెప్పాడు.ఆతర్వాతరోజు సౌరబ్ పొలం అతన్ని సంప్రదిస్తే మీతోవచ్చిన ఇద్దరూ ఈరోజు ఉదయమే వచ్చారని చెప్పాడు.మావాళ్ళేఅని సౌరబ్ చెప్పాడు కానీ బేరం చెడగొట్టడానికివెళ్ళారని ఊహించలేదు.మా నాన్న ఊరు నుండి రాలేదు మీకు ఏవిషయం రెండు రోజుల తర్వాత చెప్తానని చెప్పాడు.నిజమే కాబోలని రెండు రోజుల తర్వాత అడిగితే ఇంకా ఎక్కువ రేటు వస్తుందని ఇప్పుడు అమ్మొద్దని అనుకుంటున్నామని చెప్పాడు.ఇంతకీ విషయమేమిటంటే తమ్ముడి శ్రేయోభిలాషులు వెళ్ళికొన్నిరోజుల తర్వాతైతే నీకు ఇంకా రేటు ఎక్కువ వస్తుంది అనీ మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పారని తెలిసింది.తమ్ముడికి నీతోపాటు తీసుకొచ్చిన వాళ్ళు బేరం చెడగొట్టారని చెప్పగానే నమ్మలేదు.వాళ్ళు అలా చేయరు అని సర్దిచెప్పి వెంటనే వాళ్ళను మీరెందుకు అక్కడకు వెళ్ళారని 100 కి.మీ ప్రయాణించి అక్కడకు వెళ్ళాల్సిన అవసరమేమిటి?అని అడిగితే నట్లు కొట్టి సరిగా సమాధానం చెప్పకుండా దాటేశారు.తమ్ముడికి అర్ధమైనా అర్ధంకానట్లునటించి మొదట ఒప్పుకోకపోయినా మీరు చెప్పినది నిజమేనని ఒప్పుకోక తప్పలేదు.
No comments:
Post a Comment