Friday, 12 December 2014

బుడతడు

                                        తాన్య కొడుకు మూడు సంవత్సరాల బుడతడు.వాడికి ఎన్ని తెలివితేటలో.అన్ని పనులు ఒక పుట్టలో పెడితే వెయ్యి పుట్టల్లోకి వచ్చేట్లుగా చేస్తుంటాడు.వయసుని మించి మాట్లాడుతుంటాడు.ఇటీవలే వాడికి ఒక చెల్లి పుట్టింది.వాడికి ఒక్కడికే చెల్లి ఉన్నట్లు ఎవరినీ దగ్గరికి రానీయడు.ఈ ఇద్దరితో సతమతమైపోతూ తన గురించితాను పట్టించుకోవటానికి కుదరటం లేదని  తాన్య పార్లర్ నుండి ఇంటికి ఒకమనిషిని పిలిపించుకుంది.ఏపని చేసినా ఎందుకు?ఏమిటి ?అంటూ యక్ష ప్రశ్నలు వేస్తుంటాడు.అలాగే అడుగుతుంటే ఫేస్ పాక్ వేయించుకోవటానికి ఒకామెను రమ్మన్నానని చెప్పింది.ఆమె ఒక 1/2 గం.కు వచ్చింది.ఆమె ఎవరూ ?ఏంటి?అని చెప్పకుండానే అమ్మా!పేస్ ప్యాక్ ఆంటీ వచ్చిందోచ్ అంటూ కేకలు పెట్టి వచ్చేవరకు ఊపిరాడనివ్వలేదు.బుడతడికి ఫేస్ పాక్ అంటే  అర్ధం తెలిసినట్లుగా హడావిడి చేశాడు వాడికి ఫలానా అని చెప్పక్కర లేదు తెలివి గలవాడు అని వాడి నానమ్మ తెగ సంబరపడుతుంది.















/?   

No comments:

Post a Comment