Saturday, 6 December 2014

నానీ నోరుముయ్యి

                                         ఈశ్వరమ్మకు ఇద్దరు కొడుకులు.చిన్నకొడుక్కి ఇద్దరు పిల్లలు.పెద్దకొడుక్కి పెళ్ళయి పది సంవత్సరాలయినా పిల్లలు లేరు.కనిపించిన దేముడి కల్లా మొక్కారు.లేకలేక లోకాయ్ పుట్టినట్లు ఎట్టకేలకు ఒక కొడుకు పుట్టాడు.వాడిని  అతి గారాబంతో పెంచటంవల్ల వాడు మొండిగా తయారయ్యాడు.ఇంతలో ఇంకొక పిల్లవాడు పుట్టాడు.రామలక్ష్మణుల లాగా ఇద్దరు పుట్టారు అని సంబరపడ్డారు.పెద్దాడి మొండితనానికి విసుగొచ్చి చిన్న వాడిని మాములుగా పెంచారు.పెద్దవాడు బాగా అల్లరి చేస్తూ ఉంటాడు.ఎవరినీ లెక్క చేయడు.చిన్నవాడిని కూడా కొడుతూ ఉంటాడు.ఉదయాన్నే స్కూలుకు వెళ్ళాలంటే పెద్ద హడావిడి.చుట్టుప్రక్కల అందరికీ వాళ్ళ అల్లరి అలవాటయిపోయింది .అల్లరి చెయ్యకండిరా అని నాయనమ్మ చెబితే "నానీ నువ్వు నోరుముయ్యి" అంటూ ఉంటాడు.ఏమి చేస్తాము?అతి గారాబం వల్ల ఏదోఒకటి అంటూ ఉంటాడు.అందుకని నోరు మూసుకుని ఒక మూల కూర్చుంటాను అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది.

No comments:

Post a Comment