చేమదుంపలు కొనుక్కొచ్చి ఒక్కొక్కసారి వండటానికి వీలుపడకపోతే వాటిని నిల్వఉన్నాయనో,ఎండిపోయినాయనో బయట పడేస్తుంటాము.అలా పడేయకుండా వాటిని భూమిలో పెడితే చక్కగా మొక్కలు వచ్చి ఆకులు అందంగా ఉంటాయి.ఈ మొక్కలు అందంగానూ ఉంటాయి.ఈఆకులు పప్పులో వేసుకుంటే చాలా రుచిగా ఉండటమే కాక ఎన్నో పోషకవిలువలు కలిగి ఉంటాయి.ఒకకప్పు కందిపప్పులోఒకఉల్లిపాయ,మూడు పచ్చిమిర్చి,రెండు చేమ ఆకులు,ఒక టొమాటో,కొద్దిగా చింతపండు చేర్చికారం,ఉప్పు, సరిపడా నీళ్ళుపోసి కుక్కర్లో మెత్తగా ఉడికాక కరివేపాకు,కొత్తిమీర,వెల్లుల్లి రెబ్బలు,తాలింపు దినుసులు వేసి కొంచెం నెయ్యి,కొంచెం నూనెతో తాలింపు పెడితే చాలా రుచిగా ఉంటుంది.
కొద్దిరోజుల తర్వాత భూమిలో చేమదుంపలు తయారవుతాయి.కుండీలో కూడా పెట్టుకోవచ్చు.
కొద్దిరోజుల తర్వాత భూమిలో చేమదుంపలు తయారవుతాయి.కుండీలో కూడా పెట్టుకోవచ్చు.
No comments:
Post a Comment