Tuesday, 9 December 2014

నీకన్నా మీచెల్లెలే బాగుంది

                               లూసీ,జూలీ అక్క చెల్లెళ్ళు.హైస్కూలులో చదువుకుంటున్నారు.ఒకరోజు ఖాళీ సమయంలో లూసీ,స్నేహితురాలు రోజీ పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్నారు.అప్పుడు రోజీ నీకన్నా మీచెల్లెలే బాగుంటుంది అనేసింది.స్నేహితురాలు దగ్గర ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చి నానమ్మ దగ్గరకు వెళ్ళి నానమ్మా!నేను బాగున్నానా?లేదా?చెప్పు రోజీ నీకన్నానీచేల్లెలే బాగుంది అంటుంది.అదే బాగుందా?నిజంగా చెప్పు అని అడిగింది.
ఇద్దరు బాగానే ఉన్నారంటే వినదు.ఇంతలో చెల్లి వచ్చింది.నువ్వుచేప్పవే మనిద్దరిలో ఎవరు బాగున్నారో?అంది .
ఏమో నాకు తెలియదు అని నానమ్మానువ్వే చెప్పు అని అక్కాచెల్లెళ్లు ఇద్దరూ చెరొకచెవి దగ్గర చేరి జోరీగల్లాగా
రొద మొదలెట్టారు.చివరకు నానమ్మకు విసుగొచ్చి అందానికి కొలబద్ద ఉండదు.ఎవరి అందం వారిది.ఒకరితో ఒకరు
పోల్చుకోవాల్సిన అవసరం లేదు.ఇద్దరూ బాగానే వున్నారు.ఇక ఈ సంభాషణ ఇంతటితో ఆపేయండి అని చెప్పింది.
స్నేహితురాలు ఏమైనా బాధ పడుతుందనే ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడిన మాట ఇంత గందరగోళం
సృష్టించింది.అందుకే మాట్లాడేముందే ఆలోచించి మాట్లాడాలి.మాటే కదా అనుకుంటే అదే ఒక్కొక్కసారి పెద్దపెద్ద గొడవలకు దారితీస్తుంది. 

No comments:

Post a Comment