భువనేశ్వరికి అత్తింట్లో అందరూ తమగురించి తాము గొప్పగా చెప్పుకుంటూ ఎదుటి వారిని మీకేమీ తెలియదు మాకు అన్నీ తెలుసు.మేము ఏపనైనా చేయగలము ఆమంత్రి తెలుసు ఈ మంత్రి మేము ఎంత చెబితే అంత అంటూ చెప్పింది చెప్పకుండా స్వోత్కర్ష చెప్తూనే ఉంటారు.పిల్లాడి మొదలు పెద్దవాళ్ళ వరకూ అదే పని.ఇంతకు ముందు కన్నవారింటి వైపు ఆవిధంగా చెప్పేవాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు.ఇప్పుడు కొత్తగా ఒకాయన మొదలు పెట్టాడు.మీకేమీ మాట్లాడటము చేతకాదు.నేనొక్కడినే మీఅందరికన్నా తెలివిగలవాడిని అంటూ ప్రగల్భాలు మొదలు పెట్టాడు.ఇంతకు ముందు ఒకవైపే అనుకుంటే ఇప్పుడు రెండోవైపు కూడా స్వోత్కర్ష(సెల్ఫ్ డబ్బా)మొదలెట్టారు అని భువనేశ్వరి తల పట్టుకుంటుంది.ఇంతకీ అక్కడ పనులయ్యేది ఏమీ ఉండదు గొప్పలు చెప్పుకోవటం తప్ప.చాటుకు వెళ్ళి అమ్మపుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు వీడి గొప్పలు వీడూ అని నవ్వుకోవటము మినహా ఉపయోగం ఉండదు.
No comments:
Post a Comment