Monday, 22 December 2014

సతీ సమేతంగా

                                                    సతీసమేతంగా ఎక్కడకు వెళ్ళినా బాగానే ఉంటుంది.కానీ కొన్ని సందర్భాలలో ఇరువురికీ ఇబ్బందికరంగా ఉంటుంది.ఈమధ్య శంకర్ ప్రతిదానికి అవసరం ఉన్నా లేకున్నా భార్యను వెంటబెట్టుకుని
వెళ్ళటం మొదలుపెట్టాడు.అమ్మను తీసుకు వెళ్ళాల్సిన చోటుకు కూడా అమ్మను తీసుకెళ్ళకుండా,అమ్మపుట్టింటి వారింటికి కూడా భార్యను వెంటేసుకుని వెళ్తుంటే అమ్మను తీసుకురాలేదేంటి?అని ఎవరైనా అడిగితే అమ్మ రాలేనంది అని కథలు చెప్పటమో,మాట దాటవేయటమో చేస్తున్నాడు.అదేంటి శంకర్ అమ్మని,పిల్లల్ని తీసుకురాకుండా  మీ ఇద్దరే రావటమేమిటి? నువ్వేమీ మొయ్యాల్సిన అవసరం లేదుగా కారులో వస్తూ కూడా లింగు,లిటుకు అంటూ ఇద్దరూ వచ్చారు.ఇప్పుడే వెళ్ళి తీసుకురా?అని ఒక పెద్దావిడ చివాట్లేసింది.తర్వాత చచ్చినట్లు ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాడు.ముందే తీసుకెళ్తే బాగుండేది కదా! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే భార్యకు వాళ్ళిద్దరే వెళ్ళాలనే వింతకోరిక పుట్టిందట.అది భర్తగా శంకర్ శిరసావహిస్తున్నాడు.వెళ్ళాలనుకుంటే ఒక పదిరోజులు వాళ్ళిద్దరే ఎక్కడైనా గడిపిరావచ్చు.ఇదేమి వింత కోరికో?అని పెద్దావిడ అందరికీ పనిగట్టుకుని చెప్పింది.  

1 comment:

  1. Telugulo Rayadaniki:
    http://alllanguagetranslator.blogspot.in/2013/05/blog-post.html

    ReplyDelete