వసుమతీ దేవి గారి ఇంట్లో వంటమనిషి ఒకరోజు ఆలస్యంగా వచ్చింది.అమ్మా!ఈరోజు
కొంచెం ఆలస్యమైంది ఏమీ అనుకోకండి.మా ఆయన పిత్తపరిగెలు తెచ్చాడు.అవి బాగుచేసి కూర వండి వచ్చేసరికి ఆలస్యమైందిఅని చెప్పింది.చిటికెలో మీకు వంట చేస్తాను అలా కూర్చుని కబుర్లు చెప్పండి అనగానే పిత్తపరిగెలు అంటే ఏమిటో చెప్పు?అన్నారు.అంటే చిన్నచిన్న పిల్ల చేపల్నిమేము పిత్తపరిగెలు అంటాము.వాటిని శుభ్రం చేసి పులుసు పెట్టాను.మాఆయనకు అవంటే చాలా ఇష్టం.మేము ముల్లు తీయకుండా అన్నంలో కలిపి నమిలేస్తాము అంది.ముల్లుతోపాటు నమిలేస్తే గుచ్చుకుంటుంది కదా!అంటే వాటిని ముల్లుతోసహా తింటేనే రుచిగా ఉంటుంది.అలవాటైతే గుచ్చుకోవు.మాకు చిన్నతనం నుండి అలవాటైపోయింది అని లొట్టలేస్తూ చెప్పింది.
No comments:
Post a Comment