Saturday 23 July 2016

ఇద్దరి జీవితాలకు వెలుగు

                                                                రత్నాకరరావు గారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుండి కాయకష్టం చేసి మోతుబరి రైతుగా ఎదిగారు.ఎనభై సంవత్సరాలు వచ్చినా కూడా ఆయనకు కంటి చూపు ఇసుమంతైనా మందగించలేదు.సంపూర్ణ ఆరోగ్యంతో ఇప్పటికీ తన పని తను చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకు వ్యవసాయానికి సంబంధించిన సలహాలు ఇస్తుంటారు.ఊరిలో ఎవరింట్లో ఆవు,గేదె ఈనినా ముందుగా దూడకు తాడు రత్నాకర రావు గారు పేనాల్సిందే.ఆయన చనిపోయినా ఆయన కళ్ళు ఒకరో,ఇద్దరో అంధుల జీవితాలలో వెలుగులు నింపుతాయనే ఉద్దేశ్యంతో ఇంట్లో వాళ్లకు ముందుగానే చెప్పి కళ్ళు దానం చేస్తానని ఐ బ్యాంకు అసోసియేషన్ లో రిజిస్టరు చేయించుకున్నారు.ఒకరోజు తెల్లవారుఝామున ఉన్నట్లుండి నిద్రలోనే తుది శ్వాస విడిచారు.అకస్మాత్తుగా 
చనిపోయేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఘొల్లుమన్నారు.తర్వాత తేరుకుని ఆయన కోరిక ప్రకారం ఐ బాంక్ వాళ్లకు సమాచారం అందించారు.వాళ్ళు వెంటనే వచ్చి కళ్ళు సేకరించి తీసుకుని వెళ్లారు.రత్నాకర రావు గారు చనిపోయి కూడా ఇద్దరి జీవితాలకు వెలుగుని ఇచ్చారు.ధన్య జీవి. 

No comments:

Post a Comment