అమ్మ తర్వాత కమ్మనైన పదం స్నేహం.భగవంతుడు అందరికీ తల్లిదండ్రుల్ని,తోడబుట్టిన వాళ్ళను ఇస్తాడు.కానీ స్నేహితులను ఎంపిక చేసుకునేది మాత్రం మనమే.ఎంత మంది స్నేహితులున్నా అందరి అలవాట్లు,అభిరుచులు ఒకేలా ఉండవు.ఎలా ఉన్నా యధాతధంగా స్వీకరించేదే స్నేహం.స్నేహమంటే మధురమైనది.అసలైన స్నేహంలో ఉన్న కమ్మదనం వర్ణింలేనిది. తల్లిదండ్రులతో,స్వంతవారితో కూడా చెప్పుకోలేని విషయాలను తనతో పంచుకోగలిగినప్పుడు కలిగే నిశ్చింత,ప్రశాంతత నిజమైన స్నేహానికి చిహ్నం.అవి మూడో వ్యక్తికి చేరవేయని వారే నిజమైన స్నేహితులు.అటువంటి స్వచ్చమైన మనసుతోపాటు ఒకరు అంటే ఒకరికి నమ్మకం ఉండాలి. అవసరానికి,సరదాగా వచ్చే వంద మంది స్నేహితులు కంటే కష్టం వచ్చినప్పుడు నీకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చే వాళ్ళు అసలైన స్నేహితులు.ఈరోజుల్లో అంత మంచి ప్రాణ స్నేహితులు దొరకడం కష్టమే అయినా అటువంటి స్నేహితులు ఒక్కరు,ఇద్దరు ఉన్నా వాళ్ళు ధన్యులు.స్నేహానికి విలువ ఇస్తేనే అది కలకాలం నిలుస్తుంది.స్నేహమంటే ఇదేనోయ్ అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం విలువ తెలిసిన అందరికీ నిండు మనసుతో శుభాకాంక్షలు.
No comments:
Post a Comment