Tuesday, 28 March 2017

విలువ పోగొట్టుకున్నట్లే

                                                               ఈమధ్య కొంత మందికి  ఎదుటి మనుషులంటే మాటల్లో చెప్పలేనంత నిర్లక్ష్యంగా ఉంటుంది.మీదేముంది?మీ అందరికన్నా మేమే గొప్ప అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.ఎవరికి ఉండే గొప్ప వారికి ఉంటుంది.ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.అది అర్ధం చేసుకుని మాట్లాడటం బాగుంటుంది.మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోమని పెద్దల ఉవాచ.కొంతమందికి పైత్యం ఎంత వెర్రితలలు వేస్తుందంటే చెప్పటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.మర్యాదగా ఫోను చేసి మామ్మగారు ఉన్నారండీ?అని అడిగితే ఆ!ముందు నువ్వెవరో అర్ధమయ్యేలా?చెప్పు ఆ తర్వాత మామ్మగారు ఇంట్లో ఉన్నారో లేదో అప్పుడు నేనెవరో?చెప్తాను అని గయ్యి గయ్యమని అరవటం మొదలెట్టింది.ఏమి మాట్లాడాలో ఫోను చేసిన ఆమెకు తెలియక ఠక్కున పోను పెట్టేసింది.సమయానికి వెళ్ళిన ఆడపడుచుతో ఇదేమిటి ఒదినా?నేను ఫలానా అని మామ్మగారితో మాట్లాడాలి ఉన్నారా? అంటే గయ్యాళితనంగా అరుస్తుంది అంటూ బాధపడింది.బాధపడకు ఈరోజుల్లో ఈవిధంగా మాట్లాడటం ఫ్యాషన్ అని అనుకుంటున్నారు.అమర్యాదగా మాట్లాడితే ఎదుటివారు ఏమనుకుంటారో?అనే జ్ఞానం లేకుండా పోతుంది.మనకు ఎంత డబ్బు ఉన్నా పదవులు ఉన్నాఎదుటి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడటం పద్ధతి.పెరుగుట విరుగుట కొరకే అని గర్వం పెరిగిన కొద్దీ ఉన్న విలువ పోగొట్టుకున్నట్లే అని వాళ్ళకు అనుభవమైతే కానీ తెలియదు.
సూచన:మన బాధ వంటిదే ఎదుటి వారి బాధ అనుకుంటే ఈ తిప్పలు వుండవు.

No comments:

Post a Comment